Waltair Veerayya: మూల విరాట్ మాస్ జాతరకు డేట్ ఫిక్స్
Waltair Veerayya Trailer Date Fix: మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా కొల్లి బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన మేకర్స్ ఈ సినిమా నుంచి సాంగ్స్ ను రిలీజ్ చేసి హైప్ తెచ్చారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ఈ సాలిడ్ ట్రైలర్ కట్ ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకి రిలీజ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు.
ఇప్పటికే ఈ చిత్రంపై మెగా అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అట్రైలెర్ పోస్టర్ కూడా ఆకట్టుకొంటుంది. సముద్ర వేటలో అలలు ఎగసి పడుతున్నా లక్ష్యాన్ని గురి పెట్టిన వీరయ్య గా చిరు కనిపిస్తున్నాడు. వీరసింహారెడ్డి చిత్రంతో పాటు వాల్తేరు వీరయ్య ను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రెండు సినిమాలను బ్యాలన్సుడ్ గా మెయింటైన్ చేస్తూ ఒకదాని తరువాత ఒకటి రిలీజ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 8 న వైజాగ్ లో జరగనుంది.