Waltair Veerayya Trailer: రికార్డుల్లో పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డులు ఉన్నాయి
Waltair Veerayya Trailer Out: ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో దసరా పండుగకు వచ్చిన మెగాస్టార్ ఇప్పుడు వాల్తేరు వీరయ్య గా సంక్రాంతికి రానున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తుండగా.. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచుతూ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.
ట్రైలర్ లో చిరు రెట్రో లుక్ అదిరిపోయింది. ఊర మాస్ లుక్ లో చిరు చెప్పినట్లుగానే పునకాలు తెప్పించాడు. ఈ సినిమాలో చిరు అండర్ కవర్ ఆఫీసర్ అని ఇప్పటివరకు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ట్రైలర్ లో మాత్రం స్మగ్లర్ గా, క్రిమినల్ గా చూపించారు. ఇక చిరు కామెడీ టైమింగ్, డ్యాన్స్ లు వింటేజ్ చిరును గుర్తు చేస్తున్నాయి. ఇక రవితేజ ఎంట్రీ .. దొంగ పోలీస్ లాగా వీరిద్దరి కాంబో అదిరిపోయింది. కామెడీ, ఎమోషన్స్, యాక్షన్ అన్ని మేళవించి ట్రైలర్ ను కట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక చివర్లో చిరు గ్యాంగ్ లీడర్ డైలాగ్ ను రవితేజ చెప్పడం … రవితేజ ఇడియట్ డైలాగ్ ను చిరు చెప్పడం ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఫ్రెష్ గా ఉంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది.ఇకపోతే ఈ సినిమా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.