Waltair Veerayya: వైజాగ్ లో మాస్ జాతర మొదలుపెట్టిన మెగా ఫ్యాన్స్
Waltair Veerayya Pre Release Event Updates: మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. మెగా నామధేయంతో వైజాగ్ దద్దరిల్లిపోతోంది. ఈరోజు సాయంత్రం విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్స్ లో వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే చిరంజీవి, రవితేజ సహా చిత్ర బృందం మొత్తం విశాఖకు చేరుకొంది. అయితే చివరి నిమిషంలో హీరోయిన్ శృతి హాసన్ హ్యాండ్ ఇచ్చింది. ఆమె తన అనారోగ్యం కారణంగా ఈ ఈవెంట్ కు రాలేకపోతున్నట్లు తెలిపింది. దీంతో ఆమె ఫ్యాన్స్ కు నిరాశకు గురి అయినా మెగాస్టార్ ఉండడంతో హంగామా మొదలుపెట్టేశారు.
ఇప్పటికే గ్రౌండ్ మొత్తం మెగా అభిమానులతో నిండిపోయింది. బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్స్ తో ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్స్ కళకళలాడుతోంది. డై హార్డ్ ఫ్యాన్స్ వాల్తేరు వీరయ్య గెటప్స్ లో రెడీ అయ్యి ఈవెంట్ వద్ద సందడి చేస్తున్నారు. మరి కాసేపట్లో ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇక ఈ వేడుక వలన ఎవరికి ఎటువంటి అంతరాయం కలగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు.