Waltair Veerayya: వీరయ్య ఓటిటీలోకి వచ్చేది ఎప్పుడంటే..?
Waltair Veerayya OTT Partener Lock: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమా తాజాగా ఓటిటీ పార్ట్నర్ ను లాక్ చేసుకుందని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి సినిమాను ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నదట. భారీ ధరకు ఓటిటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే వీరయ్య కూడా వీరసింహారెడ్డి లానే ఇప్పుడప్పుడే ఓటిటీలో వచ్చేలా కనిపించడం లేదట.
మౌత్ టాక్ ఇప్పుడు బాగానే ఉంది.. రేపటితో కలక్షన్స్ అవి ఇవి చూసుకుంటే.. వీరయ్య హిట్టా.. ఫట్టా అనేది తెలుస్తోంది. ఒకవేళ హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం మౌత్ టాక్ తగ్గి, కొత్త సినిమా వచ్చేవరకు వీరయ్య ఓటిటీలోకి వచ్చే ఛాన్స్ లేదు. సరే.. ఫట్ అయినా కూడా చిరు సినిమా, అందులోను మాస్ సినిమా కాబట్టి కనీసం థియేటర్ లో ఒక్కసారి అయినా చూడొచ్చు అనే అభిమానుల కోసం థియేటర్ లోనే ఉంచుతారు. ఏది అయినా నెల వరకు ఈ సినిమా ఓటిటీలో వచ్చేదే లేదు.. ఒకవేళ వస్తే ఫిబ్రవరి చివరివారంలో వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.