ప్రస్తుతం టాలీవుడ్ రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. సాధారణంగా ఏ హీరో సినిమా రీరిలీజ్ అయినా మహా అయితే థియేటర్ లో కొద్దిసేపు ఫ్యాన్స్ రచ్చ చేసి, థియేటర్ లో సీట్లు చింపేస్తారు.
ప్రస్తుతం టాలీవుడ్ రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. సాధారణంగా ఏ హీరో సినిమా రీరిలీజ్ అయినా మహా అయితే థియేటర్ లో కొద్దిసేపు ఫ్యాన్స్ రచ్చ చేసి, థియేటర్ లో సీట్లు చింపేస్తారు. ఇప్పటివరకు అదే చూసాం. కానీ మొట్టమొదటిసారి ఒక రీ రిలీజ్ సినిమాకు.. సాంగ్ లాంచ్ లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఆ సినిమానే సింహాద్రి. సింహాద్రి విడుదలై 20ఏళ్లు కాగా ఆ సిసిమాని మే 20వ తేదీన 1000 స్క్రీన్లపై ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ వీరాభిమాని హీరో విశ్వక్ సేన్ ముఖ్య అథితిగా విచ్చేసి తారక్ ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపాడు.
గతరాత్రి జరిగిన ఈ ఈవెంట్ లో విశ్వక్ మాట్లాడుతూ.. ” దేశమంతా సింహాద్రి సినిమా రీ రిలీజ్ గురించి చర్చించుకుంటుంది. ఇది కచ్చితంగా నేషనల్ న్యూస్ అవుతుంది. ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేనుగర్వపడుతున్నాను. ఇంత వరకు ఏ అభిమానికి దక్కని అవకాశం నాకు దక్కింది. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆస్కార్ వేడుక అనంతరం క్కడ ఉండమని ఎంతమంది అడిగినా.. నా కోసం, నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వస్తానని ఇచ్చిన మాట కోసం వచ్చాడు. ఎన్టీఆర్, అభిమానులకు చాలా విలువ ఇస్తాడు. ఆ రుణాన్ని ఎప్పటికి తీర్చుకోలేను. తారక్ అన్నకు ముందుగానే హ్యాపీ బర్త్ డే” అని ముగించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఏదిఏమైనా ఒక రీ రిలీజ్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడమే విశేషం అనుకుంటే.. దానికి మరో హీరో వచ్చి ఈ రేంజ్ లో స్పీచ్ ఇవ్వడం కేవలం.. తారక్ ఫ్యాన్స్ వలనే సాధ్యమని అభిమానులు చెప్పుకొస్తున్నారు.