Virupaksha: అభిమాని మృతి.. విరూపాక్ష టీజర్ రిలీజ్ వాయిదా
Virupaksha teaser Postponed: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరూపాక్ష. సుకుమార్ రైటింగ్స్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రెండు రోజుల క్రితం ఈ సినిమా టీజర్ ను పవన్ కళ్యాణ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే నేడు ఈ సినిమా టీజర్ రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. మెగా అభిమాని సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ భీమవరంకు చెందిన రావూరి పాండు మృతి చెందడంతో తేజ్ విషాదంలో మునిగిపోయాడు.
ఇక దీంతో విరూపాక్ష టీజర్ వాయిదా పడిందని మేకర్స్ చెప్పుకొచ్చారు.ఆయన మృతి విషయం తెలుసుకున్న మెగా కుటుంబం సాయి ధరమ్ తేజ్.. ఘన నివాళులు అర్పించారు. ఇక ఈ విషయం తెలియడంతో తేజ్ అభిమానులు అతడిని ప్రశంసిస్తున్నారు. త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. తేజ్ యాక్సిడెంట్ అయ్యాక వస్తున్న మొదటి సినిమా.. ఈ చిత్రంపై అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమా తేజ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.