Virupaksha:మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్(Sai dharam tej) నటించిన తొలి సూపర్ నేచురల్ హారర్ మిస్టరీ `విరూపాక్ష`(Virupaksha).
Virupaksha:మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్(Sai dharam tej) నటించిన తొలి సూపర్ నేచురల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ `విరూపాక్ష`(Virupaksha). స్టార్ డైరెక్టర్ సుకుమార్ సమర్పకుడిగా వ్యవహరిస్తూ ఈ థ్రిల్లర్‌కు స్క్రిన్ ప్లే అందించారు. ఆయన వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన కార్తిక్ వర్మ దండు ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. బివీఎస్ ఎన్ ప్రసాద్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలై ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. సరికొత్త కథ, కథనాలతో కార్తిక్ దండు తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పట్టారు.
సాయి ధరమ్ తేజ్ కెరీర్‌కు సవాల్‌గా మారిని ఈ సినిమా ఎలా ఉంటుందో?.. బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందా? అని అంతా భావించారు. కానీ అందరి అంచనాలని తారుమారు చేస్తూ విరూపాక్ష బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వూళ్లని రాబట్టి దుమ్ముదులిపేసింది. హీరోగా సాయి ధరమ్‌తేజ్ కెరీర్లోనూ హయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్‌ని రాబట్టిన సినిమా రికార్డు సాధించింది. అంతే కాకుండా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై అనూహ్యంగా రూ.100 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరిచింది.
దీంతో హీరోగా సాయి ధరమ్‌తేజ్ కూడా వంద కోట్ల క్లబ్లో చేరిపోయారు. ఇప్పటికే థియేట్రికల్ రన్‌తో థియేటర్లలో మేకర్స్‌కు కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లోకి ఎప్పెడెప్పుడు వచ్చేస్తుందా? అని ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని భారీ మొత్తానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 21న విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీని దాదాపు నెల రోజుల తరువాత ఓటీటీలోకి వదిలారు.
ఏప్రిల్ 21న రిలీజ్ మే 21 ఆదివారం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్.. మేకర్స్ ఈ డేట్లని సెంటిమెంట్‌గా భావించారో ఏమో కానీ మొత్తానికి మే 21న విరూపాక్ష ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్‌లో శనివారం అర్థ్రరాత్రి నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ స్టార్టయింది. థియేటర్లలో ఈ మిస్టరీ థ్రిల్లర్‌ను మిస్సయిన వారు నెట్ ఫ్లిక్స్ లో హ్యాపీగా చూసేయండి మరి.