Vinaro Bagyam Vaishnu Kadha: ఓటిటీ డేట్ ఫిక్స్ చేసుకున్న కిరణ్ అబ్బవరం హిట్ సినిమా
Vinaro Bagyam Vishnu Katha OTT Date Fix: కిరణ్ అబ్బవరం, కాశ్మీరీ పర్ధేశీ జంటగా మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వినరో భాగ్యం విష్ణు కథ. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వచ్చిన సినిమా కావడంతో అభిమానులు సినిమాపై బాగా ఆసక్తిని చూపించారు. ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆహా ప్రకటించింది. ‘ఉగాది’ పండుగ సందర్భంగా ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. మురళీశర్మ కామెడీ .. చైతన్ భరద్వాజ్ సంగీతం ఈ సినిమాకి హైలైట్స్ అని చెప్పొచ్చు. మరి థియేటర్ లో రచ్చ చేసిన ఈ సినిమా ఓటిటీలో ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.