SSMB29:ఆర్ ఆర్ ఆర్`(RRR)తో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో ఓ భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే.
SSMB29:ఆర్ ఆర్ ఆర్`(RRR)తో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో ఓ భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ స్థాయిలో ఈ యమూవీని తెరపైకి తీసుకురానున్నారు. ఇండియానా జోన్స్ స్ఫూర్తితో ఈ సినిమాని రూపొందించనున్నానని ఇటీవల రాజమౌళి ప్రకటించడంతో ఈ భారీ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా? అని సినీ ప్రియులు, మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆఫ్రికా అడవుల నేఫథ్యంలో సాగే ఈ సినిమా కోసం ఇప్పటికే దర్శకుడు రాజమౌళి హాలీవుడ్‌కు చెందిన క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అంతే కాకుండా వీఎఫ్ ఎక్స్ కోసం కూడా ప్రముఖ హాలీవుడ్ కంపనీతో చర్చలు జరిపినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ SSMB29కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ని ఇప్పటికే మొదలు పెట్టిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కు కథ అందిస్తున్న ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంతకు ముందు సినిమా నేపథ్యం గురించి వివరించి ఆసక్తిరేకెత్తించిన విజయేంద్రప్రపాద్ తాజాగా మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం కానునందన్న విషయాన్ని తెలిపారు. ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ సినిమా మొదలయ్యే అవకాశం ఉందన్నారు. గతంలో ఈ ప్రాజెక్ట్ ఏ నేపథ్యంలో ఉంటుంది?.. ఏ స్థాయిలో ఉండబోతోంది వంటి ఆసక్తికర విషయాల్ని తెలిపిన ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు.
హీరో మహేష్ బాబు కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ తనకు ఎంత ముఖ్యమో వివరించిన విషయం తెలిసిందే. `ఈ సినిమాతో నా కల నెరవేరనుంది. రాజమౌళితో కలిసి ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మేమిద్దరం దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఇప్పటికి ఓకే అయింది. ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని అందరిలాగే తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని మహేష్ తెలిపారు.