Varisu: ‘వారసుడు’ గా రాబోతున్న విజయ్..
Vijay Varisu Title Poster Released: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బడా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది.
ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా టైటిల్ గురించి గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్న సంగతి తెల్సిందే. ఇక రేపు విజయ్ బర్త్ డే సందర్భంగా టైటిల్ ను రివీల్ చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు మేకర్స్.. ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే ఈ సినిమాకు వారసుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అయితే తెలుగులో వారసుడు అని కాకుండా ‘వారిసు’ అని పెట్టారు. ఇప్పటికే తెలుగులో ‘వారసుడు’ పేరుతో నాగార్జున సినిమా వచ్చిన సంగతి తెల్సిందే. దీంతో అభిమానులు కన్ప్యూజ్ కాకుండా ‘వారిసు’ అని పెట్టినట్లు తెలుస్తోంది.
తమిళ్ లో వారిసు అంటే వారసుడు అని అర్ధం. ఇక పోస్టర్ లో విజయ్ స్టైలిష్ లుక్ అదిరిపోయింది. బ్లాక్ సూట్ లో ఎంతో స్టైలిష్ గా కూర్చొని చూస్తున్న పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక పోస్టర్ కింద బాస్ తిరిగి వస్తున్నాడు అంటూ చెప్పి కథపై ఆసక్తిని పెంచేశారు. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.