Vaarasudu: విజయ్ బర్త్ డే స్పెషల్.. మూడు పోస్టర్లతో ఫ్యాన్స్ ను పిచ్చెక్కించిన మేకర్స్
Vijay Birthday Special Posters released: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నేడు తన 48 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. దీంతో అభిమానులు, ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక విజయ్ నటిస్తున్న చిత్రాల నుంచి కొత్త పోస్టర్లను రిలీజ్ చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న చిత్రం ‘వారసుడు’.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక నటిస్తోంది. ఇక ఈ సినిమా నుంచి మూడు పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేసి దళపతికి బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్. మూడు పోస్టర్లు అభిమానులు ఆకట్టుకొనేలా ఉన్నాయి. మొదటి పోస్టర్ లో విజయ్ సూట్ తో స్టైలిష్ గస కనిపించాడు. ఇక రెండో పోస్టర్ లో సంక్రాంతికి వస్తున్నట్లు సింబాలిక్ గా చెరుకు గడలు, చిన్నపిల్లలు, గాలిపటాల తో కనిపించి కనువిందు చేశాడు.
ఇక మూడో పోస్టర్ లో రంగంలోకి దిగిన సింహం లా బైక్ పై సీరియస్ గా కనిపించాడు. ప్రస్తుతం ఈ మూడు పోస్టర్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దళపతి బర్త్ డే రోజున మూడు పోస్టర్లు రిలీజ్ చేసి అభిమానులకు మంచి కానుక ఇచ్చారని విజయ్ ఫ్యాన్స్ దిల్ రాజుకు థాంక్స్ చెప్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.