Sindhav: సైంధవ్ గా మారిన వెంకీ మామ
Victory Venkatesh Saindhav Movie Poster Out: ఎఫ్ 3 తరువాత విక్టరీ వెంకటేష్ కొద్దిగా గ్యాప్ తీసుకున్న విషయం తెల్సిందే. దీంతో వెంకీ మామ సినిమాలకు దూరమయ్యాడు అని వార్తలు హల్చల్ చేసిన విషయం తెల్సిందే. ఇక ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ వెంకీ ఫార్మ్ లోకి వచ్చేశాడు. డైరెక్ట గా హిట్ కొట్టిన డైరెక్టర్ తో హిట్ కొట్టడానికి రెడీ అయిపోయాడు. హిట్ యూనివర్స్ తోహిట్ అందుకున్న శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న చిత్రం ‘సైంధవ్’. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటు సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టినట్లు మేకర్స్ తెలిపారు.
వెంకీ మామ మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా. అందుకు తగ్గట్టే పోస్టర్ అదిరిపోయింది. పోర్ట్ ఏరియాలో వున్న కంటైనర్ ల మధ్య చేతిలో ఏకే 47 గన్ ని పట్టుకుని మరో చేతిలో క్యాప్సిల్ ని పట్టుకుని వెంకీ కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ‘నేనిక్కడే వుంటాన్రా..ఎక్కడికి వెళ్లను..రమ్మను..’ అని బేస్ వాయిస్ తో వెంకీ చెప్పిన విధానమే అర్ధమవుతోంది శైలేష్ బాగా గట్టిగా ప్లాన్ చేసినట్లు. వెంకటేష్ 75వ ప్రాజెక్ట్ కావడంతో ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా వెంకీ మామకు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.