Venu Tottempudi: నాకు ఇది మరోజన్మ.. ఆశీర్వదించండి
Venu Thottempudi Speech At Ramarao on Duty Pre Release Event: మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఈ చిత్రంలో రవితేజ సరసన దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ నటిస్తుండగా.. సీనియర్ నటుడు వేణు తొట్టెం పూడి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా ప్రై రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా విచ్చేశాడు.
ఇక ఈ వేదికపై వేణు మాట్లాడుతూ “ఇప్పుడే నా మాషప్ చూపించారు గదా ..మీరు చూసింది అంతా అది నా పోయిన జన్మలో .. ఇప్పటి నుంచి మరోజన్మ.. లవ్ ఆల్ అంటూ మళ్లీ స్టార్ట్ చేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు గతంలో ఎలా ఉన్నాయో .. ఇప్పుడు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మితృడు రవితేజ గారికి నా హార్ట్ ఫుల్ థాంక్స్. ఆయన సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందాన్ని కలిగిస్తోంది. అలాగే ఈ సినిమా నిర్మాత సుధాకర్ చెరుకూరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దర్శకుడు శరత్ మండవగారికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నా మీద నమ్మకం పెట్టుకొని మళ్లీ నాకు ఈ అవకాశం కల్పించాడు. టీమ్ లోని ప్రతి ఒక్కరికీ కూడా ఈ స్టేజ్ మీదుగా నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతోంది. అందరూ కూడా ఈ సినిమాను థియేటర్స్ కి వెళ్లిచూసి ఎంజాయ్ చేసి సక్సెస్ చేద్దాం.. థాంక్యూ” అంటూ ముగించారు.