Venkatesh Maha: కెజిఎఫ్ సినిమాపై యంగ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
Venkatesh Maha Slams KGF: గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న కెజిఎఫ్ సినిమాపై టాలీవుడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా దారుణమైన కామెంట్స్ చేయడం సెన్సేషన్ సృష్టిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆ సినిమా ఒక పాప్ కార్న్ సినిమా అన్ని తీసిపడేయడమే కాకుండా హీరోను, డైరెక్టర్ ను అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. కేరాఫ్ కంచరపాలెం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన వెంకటేష్ మాట్లాడుతూ.. “రూ.వందల కోట్లు.. వెయ్యి కోట్లు.. ఇలా వసూళ్లు రాబడుతున్న చిత్రాలన్నీ నా దృష్టిలో పాప్ కార్న్ సినిమాలు. తింటూ వాటిని చూడొచ్చు. మధ్యలో సీన్ మిస్ అయినా పర్లేదన్నట్లుగా ఉంటుంది.. ఓటీటీలోనైనా చూడొచ్చు. కానీ మేము తీసేవి ఓటీటీ సినిమాలు కాదు. కచ్చితమైన థియేటర్ చిత్రాలు.
ఇక ఒక కథ గురించి చెప్తాను. తల్లి ఓ కొడుకును ఎప్పటికైనా గొప్పోడు అవ్వమని కోరుతుంది. బాగా సంపాదించి నలుగురికి ఉపయోగపడమని ఆమె ఉద్దేశం. అతడు మనుషుల్ని పెట్టి బంగారం తవ్విస్తాడు. వాడి దగ్గర కొన్ని వేల మంది పనివాళ్లు ఉంటారు. వాళ్లకు ఇందిరమ్మ పథకంలో ఇళ్లు ఇచ్చి, మొత్తం బంగారం తీసుకెళ్లి ఎక్కడో పారేస్తాడు. వాడంత నీచ్ కమీన్ కుత్తే ఎవడైనా ఉంటాడా. అలాంటి కుత్తే అవ్వమని తల్లి అడుగుతుంది. ఆ మహాతల్లిని నేను ఒకసారి కలవాలి. ఇలాంటి కథను సినిమాగా తీస్తే మనం చప్పట్లు కొట్టి హిట్ చేస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వెంకటేష్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఒక టాలీవుడ్ డైరెక్టర్ అయ్యి ఉండి ఇంకో డైరెక్టర్ గురించి ఇలా మాట్లాడడం తప్పు అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.