Veerasimha Reddy: సుగుణ సుందరి అంటూ వస్తున్న బాలయ్య
Veerasimha Reddy Second Single Date Fix: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ని ‘సుగుణ సుందరి’ అనే టైటిల్ తో డిసెంబర్ 15, 2022న విడుదల చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించారు. అదే విషయాన్ని తెలియజేసేందుకు బాలయ్య మరియు శృతి ఉన్న రొమాంటిక్ పోస్టర్ ని మూవీ మేకర్స్ విడుదల చేసారు.
సుందరమైన లొకేషన్లో చిత్రీకరించిన పాటలో తెలుస్తోంది. బాలయ్య..శ్రుతి హాసన్ జంట తెరపై ఆద్యంతం ఆకట్టుకుంటుందని మచ్చుకు వదిలిన రొమాంటిక్ కెమిస్ట్రీని పోస్టర్ చూస్తేనే అంచనా వేయోచ్చు.మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.