Veerasimha Reddy: వీరసింహుడి ఊచకోత.. 100 కోట్ల క్లబ్ లో బాలయ్య
Veerasimha Reddy Latest Collections: నందమూరి నటసింహం బాక్సాఫీస్ వద్ద గర్జించింది. అఖండ తరువాత మరోసారి బాలయ్య హిట్ కొట్టేశాడు. మొదటిరోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా పండుగ సెలవులు, వీకెండ్ కావడంతో కలక్షన్లు మాత్రం రికార్డు స్థాయిలో రాబట్టాయి. ఇక విడుదలైన నాలుగురోజల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయి బాలయ్య సత్తాను నిరూపించింది. ఇప్పటివరకు ఈ సినిమా.. రూ. 104 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసినట్లు నిర్మాతలు అధికారికంగా తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్ లో కూడా బాలయ్య పిచ్చెక్కించాడు. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటి వరకూ అక్కడ వన్ మిలియన్ కి పైగా వసూళ్లను రాబట్టింది.అఖండ తర్వాత అంతటి కలక్షన్స్ అందుకున్న సినిమాగా వీరసింహారెడ్డి నిలిచిపోతుంది.
డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ నటించింది. ఇక అన్నచెల్లెళ్ళ సెంటిమెంట్, బాలయ్య పవర్ పంచులు, ఆయన డ్యాన్స్ లు అభిమానులకు పూనకాలు తెప్పించేస్తున్నాయి. చిరంజీవి వాల్తేరు వీరయ్యకు ఏ మాత్రం తగ్గకుండా వీరసింహారెడ్డి పోటీగా నిలవడం హాట్ టాపిక్ గా మారింది. చివరికి ఎవరు సంక్రాంతి విన్నర్ గా నెగ్గుతారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.