Veera simha Reddy Trailer: మైలురాయికి మీసం మొలిచినట్లు ఉన్నాది రా
Veera simha Reddy Trailer Out: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. ఎట్టకేలకు వీరసింహారెడ్డి ట్రైలర్ అభిమానుల ముందుకు వచ్చింది. ముందు నుంచి ఊహించినట్టుగానే బాలయ్య.. ట్రైలర్ తోనే హిట్ కొట్టేశాడు. క్రాక్ సినిమాతో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి. జనవరి 12 న ఈ సినిమా రిలీజ్ కానుండడంతో నేడు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకోగా ట్రైలర్ ఇంకా అంచనాలను పెంచేసింది.
బాలకృష్ణ ఊర మాస్ లుక్, యాక్షన్ తో ట్రైలర్ నిండిపోయింది. పవర్ పంచులు, యాక్షన్ ఎలిమెంట్స్ తో మాస్ అభిమానులు పండుగ చేసుకొనేలా ఉన్నాయి. బాలకృష్ణ మాస్ లుక్, శృతి అందాలు అన్నింటికి మించి థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పాలి. ట్రైలర్ లో బాలయ్య పంచులు.. పవర్ ఫుల్ గా ఉన్నాయి. ముఖ్యంగా పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే పబ్ కు వెళ్లి నిలబడు.. అక్కడ నీకు ఒక స్లోగన్ వినిపిస్తోంది.. జై బాలయ్య.. జైజై బాలయ్య.. అది నేను.. అభిమానుల మనసును గెలిచేశాడు. ఇక పొలిటికల్ గా కూడా బాలయ్య పంచులు విసిరాడు. పదవి చూసుకొని నీకు పొగరేమో.. బై బర్త్ నా డిఎన్ఎ కే పొగరు.. అనే డైలాగ్లు అదిరిపోయాయి. మొత్తానికి ట్రైలర్ తో బాలయ్య మాస్ అరాచకం ఎలా ఉంటుందో చూపించేశాడు. ఇక ఈ డైలాగ్స్ కు థియేటర్లో సీట్లు ఉంటాయో లేదో కూడా చెప్పలేం అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలంటే జనవరి 12 వరకు ఆగాల్సిందే.