Veera Simha Reddy: వీరసింహారెడ్డి ఓటిటి లో రావడం కష్టమే..?
Veera Simha Reddy OTT Partner Lock: నందమూరి నట సింహ నేడు వీరసింహారెడ్డితో గర్జించిన విషయం తెల్సిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యి భారీ విజయం వైపు పరుగులు తీస్తోంది. నేడు ఏ థియేటర్ వద్ద చూసినా జై బాలయ్య స్లొగన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటిటీ పార్ట్నర్ ను లాక్ చేసుకుందని తెలుస్తోంది, గత ఏడాది అఖండ సినిమాను భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన డిస్నీ ప్లస్ హాట్ స్టారే ఈ సినిమాను కూడా కొనుగోలు చేసిందని టాక్ నడుస్తోంది.
ఇక ఈ చిత్రం కోసం కూడా డిస్నీ వారు గట్టిగానే ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఓటిటీలోకి రావడానికి టైమ్ పడుతుందని అంటున్నారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది కాబట్టి థియేటర్ లో క్లోజ్ అయ్యేవరకు ఓటిటీ బాట పట్టదని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మార్చి ఎండింగ్ లో ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.