Varun Tej: ‘గాండివధారి అర్జున’ ఫస్ట్ లుక్ అదిరిపోయింది
Varun Tej New Movie First Look Poster Released: గతేడాది గని సినిమాతో పరాజయాన్ని అందుకున్న మెగా ప్రిన్స్.. ఎఫ్ 3 తో కొద్దిగా తేరుకున్నాడు. ఇక ఈ సినిమాల తరువాత ఆచితూచి అడుగులు వేస్తున్న వరుణ్.. వరుస సినిమాలను ప్రకటిస్తూ జోరు పెంచేశాడు. ఇప్పటికే విటి12 ను ప్రకటించిన వరుణ్ తాజాగా నేడు తన పుట్టినరోజును పురస్కరించుకొని మరో కొత్త ప్రాజెక్ట్ ను రివీల్ చేశాడు. అక్కినేని నాగార్జునతో ఘోస్ట్ సినిమాను తెరకెక్కించి పరాజయాన్ని అందుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో వరుణ్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా పేరే గాండివధారి అర్జున.
ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ టైటిల్ పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ముఖ్యంగా వరుణ్ లుక్ అయితే అభిమానులను మెస్మరైజ్ చేసేలా ఉంది. ఫుల్ యాక్షన్ మోడ్ లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. రఫ్ లుక్ లో వరుణ్ తేజ్ అదిరిపోయాడు. త్వరలోనే ఈ సినిమా షూట్ మొదలుకానుంది. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.