Varun Tej and Lavanya:ఓ యంగ్ హీరో, పేరున్న హీరోయిన్ కలిసి నటిస్తే వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని, ఇద్దరూ డేటింగ్లో ఉన్నారని బాలీవుడ్లో పుకార్లు షికారు చేయడం కామన్.
Varun Tej and Lavanya:ఓ యంగ్ హీరో, పేరున్న హీరోయిన్ కలిసి నటిస్తే వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని, ఇద్దరూ డేటింగ్లో ఉన్నారని బాలీవుడ్లో పుకార్లు షికారు చేయడం కామన్. కానీ అదే తరహాలో టాలీవుడ్‌లోనూ ఈ మధ్య క్రేజీ హీరో, హీరోయిన్లపై తరచూ వార్తలు పుట్టుకొస్తున్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ఏదో జరగుతోందని, ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటిలో ఎలాంటి నిజం లేదని రష్మిక, విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చినా ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో ఆ వార్తలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.
ఇక మెగా ప్రిన్స్‌గా పేరున్న మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్‌పై కూడా కొంత కాలంగా ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. మిస్టర్, అంతరిక్షం వంటి సినిమాల్లో తనతో కలిసి నటించిన లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా వీరిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం కూడా పూర్తి చేసుకున్నారని కూడా రూమర్స్ వినిపించాయి. అయితే ఈ వార్తలపై ఇద్దరూ మౌనంగానే ఉంటున్నారు.
ఆ తరువాత ఎంగేజ్మెంట్ జరగలేదని, అవన్నీ రూమర్సేనని అసలు విషయం బయటికి వచ్చింది. అయితే తమపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పుకార్లని మీడియా ముందు కానీ, సోషల్ మీడియా వేదికగా కానీ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి స్ఫష్టం చేయడం లేదు. దీంతో వీరిద్దరిపై పుకార్లు మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా వరుణ్, లావణ్య పెళ్లి చేసుకోబోతున్నారని, జూన్‌లో వీరి ఎంగేజ్మెంట్ జరగనుందని తాజాగా మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
కొంత కాలంగా వరుణ్‌తేజ్ పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నామని నాగబాబు మీడియాతో చాలా సార్లు అన్నారు. కానీ ఈ మధ్య సైలెంట్ అయిపోయారు. వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఆయన మాట్లాడటం లేదు. ఈ నేపథ్యంలోనే వరుణ్, లావణ్యల పెళ్లి అంటూ వార్తలు మళ్లీ మొదలు కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతే కాకుండా ఇరు కుటుంబాల వారు కూడా వీరి పెళ్లికి ఓకే చెప్పారని, జూన్‌లో ఎంగేజ్మెంట్ కు ముహూర్తం ఖరారు చేశారని తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. ఈసారైనా వరుణ్ తేజ్ తన ప్రేమ,పెళ్లి వార్తలపై క్లారిటీ ఇస్తారా? లేక ఎప్పటిలాగే సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతారా అన్నది వేచి చూడాల్సిందే. వరుణ్ తేజ్ `గని` ఫ్లాప్ తరువాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న `గాండీవధారి అర్జున` మూఈలో నటిస్తున్నారు. దీనితో పాటు మరో సినిమా కూడా అండర్ ప్రొడక్షన్లో ఉంది.