Varun Tej and Lavanya:మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయా? అంటే అవునని ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. యంగ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripati)తో ప్రేమలో ఉన్నారని, త్వరలో వీరిద్దరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోనున్నారని ఈ మధ్య వీరిపై వరుస కథనాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Varun Tej and Lavanya:మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయా? అంటే అవునని ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. యంగ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya tripathi)తో ప్రేమలో ఉన్నారని, త్వరలో వీరిద్దరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోనున్నారని ఈ మధ్య వీరిపై వరుస కథనాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్గా వరుణ్, లావణ్యల పెళ్లికి ఇరు కుటుంబాల వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని, త్వరలో ఎంగేజ్మెంట్ జరగనుందని వార్తలు వినిపించాయి.
అయితే తాజాగా ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయిందని ప్రచారం జరగుతోంది. జూన్ 9న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్ మెంట్ జరగనుందని, అయితే ఈ కార్యక్రమంలో మాత్రం అత్యంత తక్కువ మంది మాత్రమే అతిథులు, మెగా ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు లావణ్య ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పాల్గొంటారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న `గాండీవధారి అర్జున`లో నటిస్తున్నాడు.
ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ రోమ్‌లో విహరిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి కూడా విదేశాల్లో విహరిస్తోంది. అయితే ఈ ఇద్దరు కలిసి రోమ్‌లోనే ఉన్నారని, ఎంగేజ్మెంట్ సమయానికి హైదరాబాద్ రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నెటిజన్లు కూడా వీరి పెళ్లిపై స్పందిస్తున్నారు. ఇద్దరు కలిసే విదేశాల్లో విహరిస్తున్నారని, రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ చేరుకుంటారని, జూన్ 9న వీరి ఎంగేజ్మెంట్ జరుగనుందని కామెంట్లు చేస్తున్నారు.
అయితే వరుణ్ తేజ్ కానీ, లావణ్య త్రిపాఠి కానీ ఈ వార్తలపై స్పందించడం లేదు. ఈ వార్తల్లో నిజం లేదని, మాపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని సోషల్ మీడియా వేదికగా స్పందించకపోవడం గమనార్హం. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. అప్పటి నుంచే వీరిద్దరిపై పెళ్లి వార్తలు వినిపించడం మొదలైంది.