Varun Dhawan: విక్రమ్ డైరెక్టర్ ను ఆకాశానికెత్తేసిన బాలీవుడ్ హీరో
Varun Dhawan Talking About Lokesh Kanagaraj: బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. మాస్టర్, ఖైదీ, విక్రమ్ సినిమాలతో లోకేష్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక తాజాగా దుల్కర్ సల్మాన్, పూజా హెడ్గే, కార్తీ, కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్ మరియు వరుణ్ ధావన్ వంటి పలువురు స్టార్స్ హాజరైన సినిమా గురించి చర్చించడానికి ఇటీవల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఇక ఈ సమావేశంలో వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. ” లోకేష్ దర్శకత్వం వహించి ఖైదీ సినిమాను నేను హిందీలో చూసాను. ఆయన పనితనానికి నేను ముగ్దుడును అయ్యాను.. ఆ సినిమా చూసి నాకు నేనే చాలా స్ఫూర్తి పొందాను. ఖైదీ ఒక జీనియస్ ఫిల్మ్.. అందులో పాత్రలు, మఖ్యంగా క్లైమాక్స్ నా మనసును హత్తుకున్నాయి. లోకేష్ జీనియస్ డైరెక్టర్” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ స్టార్ హీరో, లోకేష్ ను పొగడడం గొప్పగా ఉందని కోలీవుడ్ అభిమానులు చెప్పుకొస్తున్నారు.