Varasudu: ఇదేందయ్యా ఇది.. సీరియల్ అన్నారు.. రూ. 150 కోట్లు ఎలా కొట్టాడు
Varasudu Latest Collections: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, రష్మిక జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వారసుడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాను సీరియల్ అని, ల్యాగ్ ఎక్కువ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చినా ఈ సినిమా రికార్డ్స్ స్థాయి కలక్షన్లలను అందుకొని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మూవీ కేవలం విడుదలైన 5 రోజుల్లోనే రూ. 150 కోట్లు వసూలు చేసి విజయ్ సత్తా ఏంటో చూపించింది. అయితే ఇందులో ఎక్కువ తమిళ్ కలక్షన్స్ ఉన్నాయి.
ఇక తెలుగులో మూడు రోజుల కలక్షన్ల విషయానికొస్తే మొత్తం మూడు రోజుల్లో 8.9 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇదేం చిన్న విషయం కాదు. యావరేజ్ టాక్ అందుకొని కూడా ఇంత కలక్షన్లను రాబట్టడం అంటే పెద్ద విషయమే. దీంతో కోలీవుడ్ అభిమానులు అది విజయ్ రేంజ్ అంటుండగా.. తెలుగు అభిమానులు మాత్రం ఇదేందయ్యా.. ఇది.. సీరియల్ అని చెప్పి ఇన్ని కలక్షన్స్ ఎలా వచ్చాయి అని ఆశ్చర్యపోతున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.