Suri Babu: ‘వారసుడు’ రిలీజ్ కి ముందు తీవ్ర విషాదం.. ఆర్ట్ డైరెక్టర్ మృతి
Varasudu Art Director Suribabu Passes Away: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, రష్మిక జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వరిసు. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కానుంది. జనవరి 11 న ఈ సినిమా రిలీజ్ కానున్న ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక చిత్ర యూనిట్ సభ్యులు సినిమా ప్రమోషన్స్ హడావుడితో ఉన్న సమయంలో వారంతా కూడా షాక్ అయ్యే విధంగా సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన సునీల్ బాబు మృతి చెందారు.
గురువారం రాత్రి కేరళలోని తన నివాసంలో ఉండగా సునీల్ బాబుకు గుండె పోటు వచ్చిందట. దాంతో ఆయన్ను స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించడం జరిగిందట. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రాత్రి తుది శ్వాస విడిచారు. వారసుడు సినిమాలోని అత్యంత కీలకమైన ఇంటి సెట్ తో పాటు పాటల సెట్స్ కు వర్క్ చేశారట. సినిమా చాలా విభిన్నంగా రావడం కోసం ఆయన వేసిన సెట్స్ ప్రత్యేకంగా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెప్పుకోచ్చింది. వారసుడు సినిమాకే కాదు సూరి బాబు ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాకు కూడా సూరిబాబు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇక ఈ ఘటనతో వారసుడు చిత్ర బృందం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.