Major: ‘మేజర్’ టీమ్ కి ఉత్తరప్రదేశ్ సీఎం స్పెషల్ కంగ్రాట్స్.!
UP CM Yogi Aditya Nath Congratulated The Major Team: టాలీవుడ్ హీరో అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మేజర్. మజార్ సందీప్ ఉన్ని కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ య్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీని అనురాగ్ రెడ్డి శరత్ చంద్రలతో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
పలువురు ప్రముఖులు సైతం ఈ చిత్రానికి ప్రశంసలు అందించారు. ఇక ఇటీవలే ఈ సినిమాపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కూడా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా చిత్ర బృందాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్ అభినందించారు. ‘మేజర్’ మంచి విజయం సాధించిన సందర్భంగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులతోపాటు మూవీ యూనిట్‌ను కలిసి ప్రశంసించారు. వారికి శాలువా కప్పి సన్మానం చేయడమే కాకుండా వెండి నాణాలు బహుకరించారు. ఈ ఫోటోలను అడివి శేష్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్ ను కలవడం ఎంతో ఆనందంగా ఉందని, తమ సినిమాను ప్రశంసించడమే కాకుండా తమకు శాలువా కప్పి వెండి నాణాలు బహుకరించడం అద్భుతమని, ఇది మాకు దక్కిన నిజమైన గౌరవమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.