మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే రావణాసురుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచాడు. ఇక ఈ సినిమా తరువాత రవితేజ నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు.
మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే రావణాసురుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచాడు. ఇక ఈ సినిమా తరువాత రవితేజ నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన నుపూర్ సనన్ నటిస్తుండగా.. కీలక పాత్రలో రేణు దేశాయ్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రీ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు రవితేజ లుక్ కానీ, పోస్టర్ కానీ ఎక్కడా లీక్ కూడా కాకపోవడంతో ఈ సినిమాపై.. ఫస్ట్ లుక్ పోస్టర్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక అభిమానులు ఫస్ట్ లుక్ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలుసుకున్న మేకర్స్ మే 24 న ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమా కోసం రవితేజ చాలానే కష్టపడుతున్నాడు.
పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని ఇండస్ట్రీల సపోర్ట్ తీసుకుంటున్నాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కోసం పాన్ ఇండియా స్టార్స్ ను దింపేశారు. ఈ ఫస్ట్ గగ్లింప్స్ కోసం స్టార్ హీరోలు గొంతు కూడా సవరించుకున్నారు. హిందీ టీజర్ కి జాన్ అబ్రహం వాయిస్ ఓవర్ ఇవ్వగా.. తమిళ్ లో ఇదే టీజర్ కి కార్తీ…కన్నడలో శివరాజ్ కుమార్..మలయాళంలో దుల్కార్ సల్మాన్ గాత్రాన్ని అందించారు. ఇక తెలుగులో రవితేజ కోసం వెంకీ మామ దిగిపోయాడు. ఐదు భాషల్లో ఈ స్టార్ హీరోలు టైగర్ నాగేశ్వరరావు ను పరిచయం చేస్తున్నారని మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి హిట్ ను అందుకోనున్నాడో చూడాలి.