రావణాసుర సినిమాతో ఈ మధ్యనే ప్రేక్షకుల ముందు వచ్చి పరాజయాన్ని చవిచూశాడు మాస్ మహారాజా రవితేజ. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు.
రావణాసుర సినిమాతో ఈ మధ్యనే ప్రేక్షకుల ముందు వచ్చి పరాజయాన్ని చవిచూశాడు మాస్ మహారాజా రవితేజ. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన నుపుర్ సనన్ నటిస్తుండగా.. రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఒక్క అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేయలేదు. కనీసం ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది లేదు. ఇక ఎప్పుడేప్పుడు ఈ సినిమా అప్డేట్ ను ఇస్తారా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా .. అప్డేట్ ఎప్పుడు ఇస్తారు అంటూ మేకర్స్ ను అడుగుతూనే ఉన్నారు. ఇక అభిమానుల ప్రశ్నలకు డైరెక్టర్ సమాధానం చెప్పాడు. త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
“ప్రియమైన తమ్ముళ్లు అందరికి ఓపిక గా వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు మీ మెసేజెస్, ట్వీట్స్ అన్ని చూస్తున్నాను. మీరిస్తున్న ఎంకరేజ్మెంట్, ప్రేమే నాతో ఇంకా హార్డ్ వర్క్ చేపిస్తోంది. టైగర్.. నా నాలుగేళ్ల ఆకలి…మీకు ఫస్ట్ లుక్ లో చూపిస్తాను. ఈ సారి వేట మామూలుగా ఉండదు. ఫస్ట్ లుక్ వచ్చాక నా ఆకలి తో పాటు మీ అందరి ఆకలి కూడా తీరిపోతుందని అనుకుంటున్నాను.ముహూర్తం ఫిక్స్ అయ్యింది తమ్ముళ్లు.
వేటకి సిద్ధమా ?” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో రవితేజ అభిమానులు వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.