Telugu Movies:సమ్మర్ హంగామా థియేటర్ల వద్ద తగ్గు ముఖం పడుతోంది. భారీ సినిమాలేవీ లేకపోవడంతో ఈ వారం చిన్న సినిమాలదే ప్రధాన సందడిగా కనిపిస్తోంది. మే చివరి వారం అయిన ఈ వారం తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోతున్నాయి.
Telugu Movies:సమ్మర్ హంగామా థియేటర్ల వద్ద తగ్గు ముఖం పడుతోంది. భారీ సినిమాలేవీ లేకపోవడంతో ఈ వారం చిన్న సినిమాలదే ప్రధాన సందడిగా కనిపిస్తోంది. మే చివరి వారం అయిన ఈ వారం తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోతున్నాయి. థియేటర్లలో చిన్న సినిమాలు లైన్ కట్టేస్తుంటే ఓటీటీల్లో మాత్రం భారీ సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నాయి. మొత్తానికి 20కి పైనే సినిమాలు సిరీస్‌లు థియేటర్లలో..ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.
రియల్ లైఫ్ స్టోరీతో…
నరేష్, పవిత్రా లోకేష్ జంట కొంత కాలంగా నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు కూడా ఈ వార్తలని ముందు కొట్టి పారేసినా ప్రస్తుతం ఇద్దరం లీవ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉన్నామంటూ ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి నటించిన మూవీ `మళ్లీ పెళ్లి`పై సర్వత్రా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 26న రిలీజ్ అవుతోంది. ప్రధాన పాత్రల్లో నటించిన నరేష్, పవిత్రల రియల్ లైఫ్ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాని నిర్మించారు. దీంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగుతో పాటు కన్నడలోనూ ఒకేసారి రిలీజ్ కాబోతోంది.
30 మంది కొత్త నటీనటులతో…
సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ `మేమ్ ఫేమస్`. ఛాయ్ బిస్కెట్, లహరి ఫిలింస్ బ్యానర్లపై శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, చంద్ర మనోహర్ సంయుక్తంగా నిర్మించారు. సిరి రాశి, మణి, మౌర్య చౌదరి, కిరణ్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. సరికొత్త నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మే 26న విడుదల కానుంది. తెలంగాణలోని బండనర్సంపల్లి అనే గ్రామం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ సినిమాతో 30 మంది కొత్త వారిని పరిచయం చేస్తున్నారు. కొత్త తరహా చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అందరిలోనే ఆసక్తినెలకొంది.
#Mentoo ఉద్యమం..
దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే దీనికి పూర్తి భిన్నంగా మగవారి బాధల నేపథ్యంలో రూపొందిన చిత్రం `మెన్ టూ`. దర్శకుడు శ్రీకాంత్ .జి ఈ మూవీని తెరకెక్కించారు. నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ, మౌర్య సిద్ధవర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. టీజర్‌తో నెట్టింట రచ్చ చేసిన ఈ మూవీ మే 26న శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ మూవీతో పాటు గ్రే, హీరో ఆఫ్ ఇండియా వంటి తదితర చిత్రాలు రిలీజ్ కానున్నాయి.
ఈ వారం ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
సల్మాన్ ఖాన్ `కిసీకా భాయ్ కిసీకి జాన్..
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీ “కిసీకా భాయ్ కిసీకి జాన్`. ఫర్హద్ సమ్జీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించి నిర్మించారు. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. పూజా హెగ్డే హీరోయిన్. ఇతర ప్రధాన పాత్రల్లో జగపతిబాబు, భూమిక కనిపించారు. తమిళ హిట్ ఫిల్మ్ `వీరం` ఆధారంగా రీమేక్ చేసిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. అయితే ఆశించిన ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయింది. మే 26 నుంచి జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
భేదియా కూడా వచ్చేస్తోంది..
వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ `భేదియా`. ఇదే సినిమాని తెలుగులోనూ విడుదల చేశారు. రెండు భాషల్లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అమర్ కౌశిక్ తెరకెక్కించిన ఈ సినిమాని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమాలో మే 26 నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. మరి అక్కడైనా ఓటీటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందేమో చూడాలి. దీనితో పాటు ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ సిరీస్ `సీటాడెల్` ఫైనల్ ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 26న స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ లో బ్లడ్ండ్ గోల్డ్ , టిన్ అండ్ టీనా (స్పానిష్), టర్న్ ఆఫ్ ది టైడ్ (పోర్చ్‌గీస్), చోటా భీమ్ (హిందీ) సిరీస్18 26న స్ట్రీమింగ్ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో పంచువమ్ అద్భుత విళక్కుమ్ (మలయాళం), డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో `సిటీ ఆఫ్ డ్రీమ్స్` (సీజన్ 3) మే 26న నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. ఆహా ఓటీటీలో `సత్తాగాని రెండెకరాలు`, జీ5లో విజయ్ సేతుపతి, కమెడియన్ సూరిల కాంబినేషన్లో దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన `విడుదల పార్ట్ 1` మే 26న స్ట్రీమింగ్ కానున్నాయి.