BiggBoss 6: వర్మ బ్యూటీ అవుట్.. నిజమేనా..?
This Week Inaya Out From Biggboss 6: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ముగింపు దశకు చేరుకొంటుంది. రెండు నెలలుగా కొనసాగుతూన్న ఈ షో చిత్తకే చివరి అంకానికి చేరుకోనుంది. కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు. ఇక ఈ వారం ఇనయ బయటికి వస్తుందని టాక్ నడుస్తోంది. రామ్ గోపాల్ వర్మతో వేసిన ఒక డ్యాన్స్ ఆమెను పాపులర్ సెలబ్రిటీ ని చేసి బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చేలా చేసింది. ఎవరివలన ఆమె ఇంట్లోకి వెళ్లినా గేమ్ మాత్రం తాను ఒక్కత్తే ఆడింది. ఎంతమంది ఎన్ని విధాలుగా టార్గెట్ చేసినా స్ట్రాంగ్ గా నిలబడి చివరి వరకు వచ్చింది.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఇనయ నేడు ఎలిమినేట్ అవుతుందట. ఇనయా టాప్ 5 లో కాదు టాప్ 3లో ఉంటుందని అనుకోగా ఇలా లీస్ట్ ఓటింగ్ తో ఎలిమినేట్ అవుతుందని ఊహించలేదు. మొదటి వారం నుంచి తన ఆట తీరు.. మాట తీరుతో అలరిస్తూ వచ్చిన ఇనయా ఫైనల్ వీక్ వరకు ఉంటుందని గట్టిగా ఫిక్స్ అయ్యారు. మరీ టాప్ 5 గా కూడా ఉండకుండా ఇనయ బయటికి రావడం అభిమానులకు షాకింగ్ న్యూసే.. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.