Oscar 2023: ఆస్కార్ బరిలో మరో రెండు హిట్ సినిమాలు..
‘The Kashmir Files’, ‘Kantara’ Films Eligible For Oscars 2023 Nominations: ఇండియన్ సినిమా ఖ్యాత్ రోజురోజుకు పెరుగుతోంది. కొత్త కొత్త కథలతో డైరెక్టర్లు ఇండియన్ సినిమాను ప్రపంచానికి చూపిస్తున్నారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డులకు 10 ఇండియన్ చిత్రాలు షార్ట్ లిస్ట్ అవ్వడం ఎంతో ఘనతను సంతరించుకుంది. మొన్నటి వరకు సౌత్ నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా ఒక్కటే ఆస్కార్ బరిలో ఉంది. తాజాగా మరో రెండు సినిమాలు ఆస్కార్ బరిలో దిగనున్నాయి. వో అంటూ ఇండస్ట్రీని ఊపేసిన కాంతార, నార్త్ నుంచి ది కాశ్మీరీ ఫైల్స్ సినిమాలు ఆస్కార్ నామినేషన్ కు అర్హత సాధించాయి.
ఇక ఈ విషయాన్నీ అధికారికంగా ఆ సినిమాల మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలపడం జరిగింది. రిషబ్‌శెట్టి నటించిన ‘కాంతార’ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు అర్హత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 301 సినిమాలు పురస్కారాల కోసం పోటీ పడుతున్నాయి. 95వ ఆస్కార్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన చిత్రాలను జనవరి 24న ప్రకటిస్తారు. మార్చి 12న ఆస్కార్ వేడుక జరగనుంది. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా ఆస్కార్ వరకు చేరుకుంటుందో చూడాలి.