RRR: అందుకే ఆస్కార్ వేదికపై చరణ్, తారక్ డ్యాన్స్ చేయలేదట
That’s Why Charan And Tarak Did Not Dance On Oscar Stage: ఆర్ఆర్ఆర్ సినిమా లోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ వచ్చిన విషయం తెల్సిందే. ప్రతి భారతీయుడు ఈ అవార్డు ఇండియా తెచ్చినందుకు ఎంతగానో గర్విస్తున్నాడు. ఆస్కార్ ప్రారంభం కాకముందు ఆస్కార్ వేదికపై ఈ సాంగ్ కు చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ వేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. దీంతో ఇంటర్నేషనల్ వేదికపై మన హీరోల డ్యాన్స్ చూడాలని అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూసారు. అయితే అనుకోని రీతిలో ఇద్దరు హీరోలు డ్యాన్స్ చేయలేదు. అసలు ఆస్కార్ వేదికపై వారు ఎందుకు డ్యాన్స్ చేయలేదు అన్న విషయం ఇప్పుడు బయటకొచ్చింది. ఈ విషయాన్నీ ఆస్కార్ ఈవెంట్ ప్రొడ్యూసర్ రాజ్ కపూర్ స్వయంగా వెల్లడించారు.
” మొదట చరణ్, తారక్ డ్యాన్స్ చేయడానికి ఒప్పుకున్నారు. కానీ, అమెరికా వచ్చిన దగ్గరనుంచి ఇద్దరికీ వరుస ఇంటర్వ్యూలు ఉండడం, అలిసిపోవడం వలన స్టేజిపై వారు డ్యాన్స్ చేయడం అంత కంఫర్ట్ గా లేదు అని చెప్పారు. అందుకే వారు డ్యాన్స్ చేయలేకపోయారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ సాంగ్ ను ఆస్కార్ స్టేజిపై సింగర్స్ రాహుల్, కాల భైరవ ఆలపించగా విదేశీ డ్యాన్సర్లు డ్యాన్స్ చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే అది కూడా గొప్పే. మన తెలుగు పాటకు విదేశీయులు డ్యాన్స్ చేయడం అంటే విశేషంగానే చెప్పుకోవాలి.