#Thalapathy68:కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(thalapathy Vijay)కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
#Thalapathy68:కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(thalapathy Vijay)కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంత కాలంగా తనదైన మార్కు సినిమాలతో స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి రూపొందించిన `వారసుడు` మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ ప్రస్తుతం `విక్రమ్` ఫేమ్ లోకేష్ కనగరాజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `లియో`లో నటిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్.ఎస్. లలిత్ కుమార్, జగదీష్ పళని స్వామి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన ఇందులో విజయ్‌కి తండ్రిగా కనిపిస్తారని వార్తలు విపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సినిమా తరువాత చేస్తున్న మరో ప్రాజెక్ట్ కు విజయ్ షాకింగ్ రెమ్యునరేషన్‌ని తీసుకుంటున్నారని కోలీవుడ్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. `లీయో` తరువాత విజయ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో తన 68వ సినిమాఇ చేయబోతున్నారు.
దీన్ని గతంలో విజయ్‌తో `బిగిల్` మూవీని నిర్మించిన ఏజీఎస్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత కల్యాతి ఎస్ అగోరం నిర్మించనున్నారు. ఆదివారం అధికారికంగా ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. దర్శకుడు వెంకట్ ప్రభు ఆసక్తికరమైన వీడియోలో ఈ ప్రాజెక్ట్ తనకు దక్కడం తన డ్రీమ్ ఫుల్ ఫిల్ అయిందని, కలకల్ని నిజం చేయడంతో దేవుడు ఉన్నాడని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ వీడియో, వెంకట్ ప్రభు షేర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
విజయ్ స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. ఈ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ కోసం హీరో విజయ్ ఏకంగా రూ.150 కోట్ల మేర పారితోషికం డిమాండ్ చేశారని, మేకర్స్ విజయ్ కున్న క్రేజ్ దృష్ట్యా ఆ మొత్తాన్ని ఇవ్డానికి అంగీకరించారని, అందులో భాగంగానే ఆదివారం సినిమా ఫైనల్ చేసి అధికారికంగా ప్రకటించారని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాట రజనీకాంత్, అజిత్ లకు మించి విజయ్ మార్కెట్ ఉందని, ఆ కారణంగానే అతనికి భారీ మొత్తం ఇవ్వడానికి మేకర్స్ వెనుకాడటం లేదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే గతంలో ఒక్కో సినిమాకు రూ. 80 కోట్లు మాత్రమే తీసుకున్న విజయ్ ఏకంగా తన పారితోషికాన్ని డబుల్ చేయడం కోలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తను నటించిన సినిమాలు దాదాపు రెండు వందల కోట్లకు మించి వసూళ్లని రాబడుతున్న నేపథ్యంలో విజయ్ ఆ మాత్రం డిమాండ్ చేయడంలో తప్పులేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ వాదనలో నిజమెంత అన్నది తెలియాలంటే వెంకట్ ప్రభుతో చేయనున్న 68వ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.
Dreams do come true ❤️ God is kind 🙏🏼🙏🏼🙏🏼 #Thalapathy68 @Ags_production #KalpathiSAghoram @actorvijay @thisisysr @archanakalpathi @Jagadishbliss @aishkalpathi @venkat_manickam @onlynikil @RIAZtheboss pic.twitter.com/lgE3gz4bxe
— venkat prabhu (@vp_offl) May 21, 2023