Tarakaratna: నేడే కల్చరల్ క్లబ్ లో తారక రత్న దశదిన కర్మ
Tarakaratna Peddakarma At Filmchamber: నందమూరి తారకరత్న గతనెల గుండెపోటుతో మృతిచెందిన విషయం తెల్సిందే. దాదాపు 23 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహాశివరాత్రి రోజున కన్నుమూశాడు. ఇక తాజాగా ఆయన దశదిన కర్మను నేడు కుటుంబ సభ్యులు నిర్వహించారు. హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందరేశ్వరి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు పాల్గొన్నారు. వీరందరూ తారకరత్న ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఇక మొదటి నుంచి తారకరత్నను చూసుకుంటున్న బాబాయ్ బాలకృష్జనే ఈ కార్యక్రమాన్ని కూడా చూసుకున్నాడు. ఆయనతో పాటు విజయ్ సాయిరెడ్డి కూడా పెద్దగా నిలబడ్డారు. తారకరత్న ప్రేమ పెళ్లిని అంగీకరించని నందమూరి ఫ్యామిలీ..అతని మరణం తర్వాత భార్య బిడ్డలను తమ కుటుంబ సభ్యులుగా చేర్చుకుంటామని బాలకృష్ణ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు పెద్ద కర్మ కూడా బాలకృష్ణ, విజయసాయిరెడ్డి లు ఇద్దరూ కలిపి చేస్తూ ఉండటం అభినందనీయమని అభిమానులు అంటున్నారు.