Tammareddy Bharadwaja: ఈ బుద్ధి ముందు ఏమయ్యిందో..
Tammareddy Bharadwaja Congratuleted RRR Team: నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఆయన మనసుకు నచ్చింది మీడియా ముందు మాట్లాడడం.. ఆ తరువాత విమర్శలు అందుకోవడం అలవాటుగా మారిపోయింది. ఇక మొన్నటికి మొన్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆస్కార్ అవార్డుల గురించి తమ్మారెడ్డి మాట్లాడిన మాటలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మొన్నటికి మొన్న ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ 80 కోట్లు ఖర్చు పెట్టిందని… ఆ డబ్బుతో 8 సినిమాలు తీసి ముఖాన కొడతానని ఆయన కామెంట్లు చేసిన విషయం తెల్సిందే.
ఇక దానిమీద పెద్ద చర్చనే జరిగింది. ఇక తాజాగా ఆయన ఆర్ఆర్ఆర్ ను ప్రశంసించడం హాట్ టాపిక్ గా మారింది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ విన్ అవ్వగానే ఈ అవార్డు అందుకోవడంతో తమ్మారెడ్డి స్పందిస్తూ కీరవాణి గారు ఆస్కార్ అందుకోవటం.. నాకు వచ్చినంత ఆనందంగా ఉందని అన్నారు. నేను కుటుంబంలో పెద్దగా ప్రమోషన్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని నేను అన్న సందర్భం వేరు జాగ్రత్త చెప్పాను తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని, రాజమౌళికి కీరవాణి గారికి చంద్రబోస్ కు ఆర్ఆర్ఆర్ టీమ్ కు అభినందనలు అంటూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో అభిమానులు ఈ బుద్ది ఏదో ముందే ఉంటే బావుండేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.