Babli Bouncer: డైరెక్ట్ గా ఓటిటీ లో రిలీజ్ కానున్న తమన్నా ‘బబ్లీ బౌన్సర్’..
Tamannaah Bhatia’s Babli Bouncer to premiere on Disney+ Hotstar: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం బబ్లీ బౌన్సర్. మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటీ లో విడుదల కానుంది. మొదటి నుంచి ఈ సినిమాను థియేటర్ లోనే రిలీజ్ చేయనున్నారని టాక్ నడిచింది. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నదని తెలుస్తోంది.
ఇక తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో బబ్లీ బౌన్సర్ ఓటిటీ లోనే రిలీజ్ కానుందని కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా డిస్నీ+ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ మేకర్స్ తెలిపారు. అంతే కాకుండా తమన్నా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో తమన్నా టైటిల్ కు తగ్గట్టే బబ్లీ బౌన్సర్ గా కనిపించింది. లేడీ బౌన్సర్‌గా తమన్నా ఎదుర్కున్న సమస్యలు ఏంటి..? అసలు ఆమె బౌన్సర్ గా మారాల్సిన అవసరం ఏమి వచ్చింది..? అనేది వినోదాత్మకంగా చూపించనున్నారు. అయితే ఇంకా మూడు నెలలు ఉండగానే ఈ సినిమాను ఓటిటీ లో ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది. థియేటర్స్ లో రిలీజ్ కాకపోవడానికి కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమాతో తమన్నా ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.