Director Bobby:ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబి రూపొందించిన మూవీ `వాల్తేరు వీరయ్య`(Waltair Veerayya).
Director Bobby:ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ రూపొందించిన మూవీ `వాల్తేరు వీరయ్య`(Waltair Veerayya). మాస్ మహారాజా రవితేజ కీలక అతిథి పాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య మైత్రీ మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. సంక్రాంతి రేసులో విజేతగా నిలిచింది. ఇందులో వింటేజ్ చిరుని పరిచయం చేయడంతో దర్శకుడు బాబీ ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు.
ఈ మూవీ అందించిన సక్సెస్ ఆనందంలో ఉన్న దర్శకుడు బాబీకి సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి బిగ్ ఆఫర్ లభించింది. సినిమా చూసి, చిరు మేకోవర్ని, ఆయన పాత్రని మలిచిన విధానాన్ని మెచ్చుకున్న రజినీ త్వరలో బాబీతో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. రజినీ 70వ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని, ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తారని ప్రచారం జరిగింది. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని కూడా వార్తలు వినిపించాయి.
అయితే తాజాగా రజినీకాంత్ దర్శకుడు బాబీకి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ముందు ఆసక్తి చూపించిన రజినీ ఆ తరువాత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని.. కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో న్యూస్ వినిపిస్తోంది. రజినీ షాకివ్వడంతో దర్శకుడు బాబీ టాలీవుడ్ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణతో తన తదుపరి ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టాలనుకుంటున్నారట. ఇప్పటికే బాలయ్య లైన్ విని ఓకే చెప్పేశారని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తన 108వ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నఈ మూవీని విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీనిలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలయ్యకు కోడలిగా శ్రీలీల కనిపించనుంది. బాలకృష్ణ విభిన్నమైన మేకోవర్‌తో లారీ డ్రైవర్‌గా పవర్ ఫుల్ రోల్లో కనిపించనున్నారు.