సందీప్ కిషన్ “మైఖేల్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా మారాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తాజాగా ఈ హీరో నటిస్తున్న చిత్రం ‘మైఖేల్’. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రంజిత్ జైకోడి దర్శకత్వం వహిస్తుండగా శ్రీనివాస సినిమాస్ ఎల్ ఎల్ పి వారు మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.
ఇక నేడు సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇప్పటికే ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ లో సిక్స్ ప్యాక్ తో మెప్పించిన ఈ హీరో మరోసారి సిక్స్ ప్యాక్ తో అదరగొట్టాడు. ఒక చేతిలో బాంబ్ .. మరో చేతిలో గన్ తో షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ చూపిస్తూ ఉగ్ర రూపంలో కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
BLOOD, GUNS & GUTS!
Unveiling the Fiery and Menacing #MichaelFirstLook ❤️🔥 in all its Glory🌟
▶️ https://t.co/O25PSE3JBR#HBDSundeepKishan❤️#Michael 👊🏾@VijaySethuOffl @menongautham @varusarath5 @itsdivyanshak @jeranjit @SVCLLP @KaranCoffl @SamCSmusic @adityamusic pic.twitter.com/Qrp8URNRE1— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) May 7, 2022