తెలుగు చలనచిత్ర పరిశ్రమ 69 సంవత్సరాల కల నెరవేరింది. పుష్పరాజ్(Pushparaj) ఎక్కడా తగ్గలేదు. ఇవ్వాల్సింది కూడా దిమ్మతిరిగేలా ఇచ్చాడు. ఎట్టకేలకు తెలుగోడు ఓ జాతీయ అవార్డును(National Award) సాధించాడు.. చరిత్ర సృష్టించాడు.
Sukumar : తెలుగు చలనచిత్ర పరిశ్రమ 69 సంవత్సరాల కల నెరవేరింది. పుష్పరాజ్(Pushparaj) ఎక్కడా తగ్గలేదు. ఇవ్వాల్సింది కూడా దిమ్మతిరిగేలా ఇచ్చాడు. ఎట్టకేలకు తెలుగోడు ఓ జాతీయ అవార్డును(National Award) సాధించాడు.. చరిత్ర సృష్టించాడు. తెలుగు సినీ ప్రేక్షకులేకాదు.. తెలుగు ప్రజలందరికీ ఇది మంచి శుభ సమయం లాంటిది. 69ఏళ్ల తర్వాత.. 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ఎంపికయ్యారు.
69 సంవత్సరాల తెలుగు ఇండస్ట్రీ కల.. నెరవేరింది. ఎప్పుడూ తగ్గని పుష్ప రాజ్ యాటిట్యూడ్ లా.. ఎట్టకేలకు తెలుగోడికి ఐకాన్ స్టార్ జాతీయ అవార్డును పట్టుకొచ్చారు. ఎట్టకేలకు ఓ తెలుగోడు నేషనల్ అవార్డును కొట్టారు. 69 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.
ఎంతోమంది స్టార్ హీరోలు కూడా గతంలో దీన్ని సాధించలేకపోయారు. ఈ అవార్డు ప్రకటనతో పుష్ప దేశవ్యాప్తంగా వైరలవుతున్నాడు. దీన్ని గెలవడంతో తన నియర్ అండ్ డియర్స్ , పుష్ప సినిమా బృందం అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. ఈ క్రమంలోనే చిత్ర డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ను కౌగిలించుకొని, గట్టిగా హత్తుకొని అభినందనలు తెలియజేశారు. అయితే తన హగ్‌ను ఎక్కువ సమయం అలాగే ఉంచడంతోపాటు సుకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. సుక్కు కళ్లు చెమ్మగిల్లాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..
పుష్ప సినిమా జాతీయస్థాయిలో రెండు అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ఎంపికయ్యారు. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై యెర్నేని నవీన్, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.