Singer Mangli: బ్రేకింగ్.. సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి
Stones Attack On Singer Mangli’s Car: టాలీవుడ్ సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగింది. కర్ణాటకలోని బళ్లారిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమంలో తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు
వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం చిక్కబళ్లాపుర్ లో మంగ్లీ పాల్గొంది. ఆ కార్యక్రమంలో ఆమె తెలుగులోనే మాట్లాడింది.
కన్నడలో మాట్లాడమని వారు బలవంతం చేసినా తెలుగే వారికి అర్థమవుతోందని తెలుపుతూ ఆమె స్పీచ్ మొత్తాన్ని తెలుగులోనే ఇచ్చింది. ఇక కన్నడలో రెండు మూడు మాటలు మాట్లాడడంతో కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఈసారి కర్ణాటక వచ్చిన ఆమెపై వారు ఆ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తోంది. కానంద భాషను తక్కువ చేసి మాట్లాడిందన్న కోపంతో వారు మంగ్లీ కారుపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో మంగ్లీ కారు పూర్తిగా ధ్వంసమైనట్లు టాక్. ప్రస్తుతం మంగ్లీ సేఫ్ గా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.