Star Anchor Vishnu Priya Face Book Hacked:టాలీవుడ్ స్టార్ యాంకర్ విష్ణుప్రియ చిక్కుల్లో పడింది. గత కొన్ని రోజుల నుంచి ఆమె ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది.
Star Anchor Vishnu Priya Face Book Hacked:టాలీవుడ్ స్టార్ యాంకర్ విష్ణుప్రియ చిక్కుల్లో పడింది. గత కొన్ని రోజుల నుంచి ఆమె ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఆ అకౌంట్ లో నగ్న వీడియోలు, అసభ్యకరమైన పోస్టులు కనిపించడంతో నెటిజన్లు, ఆమె అభిమానులు విష్ణు ప్రియకు కాల్స్ మీద కాల్స్ చేసి తిట్టడం మొదలుపెట్టారు. ఇక వీటిపై స్పందించిన విష్ణు ప్రియా.. తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని, ఎంత ప్రయత్నించినా తన అకౌంట్ ను తిరిగి తీసుకురాలేకపోతున్నామని చెప్పుకొచ్చింది.
ఇక అలా అన్న మూడు రోజులకే మరోసారి ఆమె ఫేస్ బుక్ ఐడీలో నగ్న వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో మరోసారి విష్ణుప్రియ స్పందించింది. ఎవరో నన్నే టార్గెట్ చేస్తున్నారు. ఇదంతా కావాలనే చేస్తున్నారు. నా ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. దయచేసి అందులో వీడియోలకు నాకు ఎటువంటి సంబంధం లేదని నమ్మండి అంటూ విష్ణు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే విష్ణుప్రియ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది.