SSMB28:సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh babu)నటిస్తున్న 28వ ప్రాజెక్ట్ టైటిల్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram)తో కలిసి దాదాపు పుష్కర కాలం తరువాత మహేష్ చేస్తున్న సినిమా ఇది.
SSMB28:సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh babu)నటిస్తున్న 28వ ప్రాజెక్ట్ టైటిల్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram)తో కలిసి దాదాపు పుష్కర కాలం తరువాత మహేష్ చేస్తున్న సినిమా ఇది. SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు.
`అతడు`, ఖలేజా వంటి సినిమాల తరువాత త్రవిక్రమ్, మహేష్‌ల కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు అనుగుణంగానే సినిమా ఉంటుందని మేకర్స్ ఫ్యాన్స్‌కు హామీ ఇస్తున్నారు. త్రివిక్రమ్ మార్కు ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని సిగరెట్ కాలుస్తూ మహేష్ నడిచి వస్తున్న తీరు నెట్టింట మహేష్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించి వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఈ మూవీ టైటిల్ ఎప్పుడెప్పుడు రివీల్ చేస్తారా? అని ఎదురు చూస్తున్న అభిమానులకు మేకర్స్ మాసీవ్ అప్ డేట్ ఇచ్చేశారు. ఈ మూవీ టైటిల్‌తో పాటు వీడియో గ్లింప్స్‌ని సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న విడుదల చేస్తూ ఫ్యాన్స్‌ని సర్ ప్రైజ్ చేయబోతున్నారు. ఈ గ్లింప్స్‌తో మాస్ డైలాగ్స్ ని కూడా వినిపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈసారికి డైలాగ్స్ లేకుండా కేవలం టైటిల్‌తోనే సర్ ప్రైజ్ చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేశారట. దీంతో గ్లింప్స్‌లో పెద్దగా డైలాగ్స్ ఏవీ ఉండదని లేటెస్ట్ న్యూస్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే శనివారం మేకర్స్ కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. చెక్స్ షర్ట్ వేసుకుని, తలకు రెడ్ కలర్ స్కార్ష్ కట్టుకుని సిగరేట్ కాలుస్తూ మహేష్ వెళుతున్న స్టిల్ ని విడుదల చేశారు. అయితే ఫేస్ కనిపించకుండా అటు వైపు తిరిగి ఉన్న పోస్టర్ని విడుదల చేయడంతో ఫ్యాన్స్ అప్పుడే సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. ఈ గ్లింప్స్‌తో పాటు సూపర్ స్టార్ కృష్ణ నటించిన `మోసగాళ్లకు మోసగాడు` 8కెలో రీరిలీజ్ అవుతుడటంతో ఘట్టమనేని ఫ్యాన్స్ డబుల్ ట్రీట్‌ని భారీ స్థాయిలో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.
మే 31న మాస్ ట్రీట్ వీడియోని సూపర్ స్టార్ అభిమానుల చేత విడుదల చేయబోతున్నాం. ఫెస్టివల్ ప్రారంభం కాబోతోంది. మమ్మల్ని అభిమానించే ఫ్యాన్స్‌పై గౌరవం, ప్రేమ కారణంగా 31 వరకు కొంత వరకు సర్ ప్రైజింగ్ కంటెంట్‌ని దాస్తున్నాం` అని యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్వీట్ చేశారు. అంతే కాకుండా #SSMB28MassStrike పేరుతో సర్ ప్రైజింగ్ వీడియోని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. థియేటర్లలో ప్రత్యేకంగా గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్ చేత విడుదల కానున్న సందర్భంగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విడుదల చేసిన SSMB28 కొత్త పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.
A MASS Feast For Fans and By Fans! #SSMB28MassStrike to thunder its way on 𝟑𝟏𝐬𝐭 𝐌𝐀𝐘! ⚡😎
SUPER FANS will unveil Striking video at the 𝐓𝐇𝐄𝐀𝐓𝐑𝐄𝐒!! 🤩🎥
Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli… pic.twitter.com/l3VKLuyqWP
— Haarika & Hassine Creations (@haarikahassine) May 27, 2023