Rajamouli: రాజమౌళి సక్సెస్ అంటే అది రా..
SS Rajamouli Meets Avatar Director James Cameron: ఇండియా పేరు అంతర్జాతీయ వేదికలపై మారుమ్రోగిపోతోంది. అందుకు కారణం దర్శకుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ అనే ఒకే ఒక్క సినిమాతో ప్రపంచం మొత్తం ఇండియా ముందు వంగి నిలబడుతోంది. అవార్డుల మీద అవార్డులు ఇండియాకు వరిస్తున్నాయి. ఇక హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం ఆర్ఆర్ఆర్ సినిమాను చూసి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక నిన్నటికి నిన్న రాజమౌళి.. తన అభిమాన డైరెక్టర్ స్టీవ్స్ బర్గ్ ను కలిసిన సంగతి తెల్సిందే. తన దేవుడ్ని కలిసినట్లు రాజమౌళి ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
ఇక తాజాగా మరో హాలీవుడ్ దర్శకుడిను రాజమౌళి కలిశాడు. అతను ఎవరో కాదు.. అవతార్ సినిమాతో ప్రపంచాన్ని షేక్ చేసిన జేమ్స్ కామెరూన్. ఆయన రాజమౌళిని కలవడమే కాకుండా ఆర్ఆర్ఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమా తనకు చాలా బాగా నచ్చిందని, ఒకసారి కాదు రెండు సార్లు సినిమా చూశానని జేమ్స్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. ఈ సినిమాను చూడమని తన భార్యకు రిఫర్ కూడా చేసినట్లు తెలిపాడు. ఇక ఆ మాటలకు రాజమౌళి పొంగిపోయాడు. జేమ్స్ ను ఆలింగనం చేసుకొని థాంక్స్ చెప్పి తన అభిమానాన్ని కూడా ప్రదర్శించాడు.ఇక దీంతో మరోసారి రాజమౌళిని అభిమానులు ప్రశంసిస్తున్నారు. అసలైన విజయం అంటే ఇదేనని, ఎక్కడ టాలీవుడ్.. ఎక్కడ హాలీవుడ్.. ఇక్కడ నుంచి అక్కడకు ఒక సినిమాను తీసుకెళ్లిన ఘనత జక్కన్న ది.. ఇది అసలైన విజయం.. రాజమౌళి తెలుగు వాడిగా పుట్టడం ఇండియా చేసుకున్న అదృష్టం అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.