Srinidhi Shetty: యష్ వేధించాడంటూ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
Srinidhi Shetty Reacts Rumors About Yash: కేజిఎఫ్ నటి శ్రీనిధి శెట్టి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఆమె.. కొన్ని రోజుల క్రితం తనకు, హీరో యష్ కు మధ్య విబేధాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై స్పందించింది. దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఫిలిం క్రిటిక్ గా చెప్పుకునే ఉమైర్ సంధు ఇండస్ట్రీలోని నటీనటులపై ఘాటు ఆరోపణలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక శ్రీనిధి శెట్టి- యష్ ల గురించి కూడా అతడు ఘాటు ఆరోపణలు చేశాడు. ఆమె యశ్ తో పనిచేయటానికి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయిందని అతనితో మరోసారి పనిచేయను అని చెబుతుందని ఆరోపించాడు. అతను టాక్సిక్ అని హెరాస్ చేసే వ్యక్తి అని ఆమె చెప్పినట్లుగా ట్వీట్ చేశాడు.
ఇక ఈ ట్వీట్ పై శ్రీనిధి స్పందించింది. ఆ వార్తలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఎప్పటికీ యష్ తో పనిచేయడం తన అదృష్టంగానే భావిస్తానని చెప్పుకొచ్చింది. ” కొంతమంది సోషల్ మీడియాలో ద్వేషాన్ని దుష్ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే నేను ప్రేమను నా జీవితంలో నేను ఎదగడానికి కారణమైన వారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వాడుకుంటున్నాను. ప్రతిసారి ఇదే మాట చెప్తున్నాను అని అనుకోకపోతే.. కేజిఎఫ్ సినిమాలో యశ్ తో పని చేయడం నిజంగా ఒక అద్భుతమైన గౌరవం. ఆయనతో పనిచేయడం అదృష్టం. ఆయన ఒక నిజమైన జెంటిల్మెన్ ఒక మెంటర్ ఒక స్నేహితుడు నిజంగా ఒక ఇన్స్పిరేషన్. యష్.. నేను ఎప్పటికీ మీ అభిమానురాలినే” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ వార్తల్లో నిజం లేదని అర్దమయ్యిపోయింది. యష్ పై తన
అభిమానాన్ని చూపినందుకు యష్ ఫ్యాన్స్ శ్రీనిధిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.