Roshan: వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఛాన్స్ పట్టేసిన శ్రీకాంత్ తనయుడు
Srikanth Son Roshan To Act In Vyjayanthi Banner: నిర్మలా కాన్వెంట్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో రోషన్. స్టార్ సీనియర్ హీరో శ్రీకాంత్ వారసుడుగా తెలుగునాట అడుగుపెట్టాడు. ఇక రెండో సినిమానే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD చిత్రంలో నటించి మెప్పించాడు. తండ్రిలానే అందం, అభినయం కలబోసి పుట్టిన ఈ కుర్ర హీరోకు మంచి భవిష్యత్తు ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక తాజాగా రోషన్ బంపర్ ఆఫర్ పట్టేసాడు. సీతారామం తో బిగ్గెస్ట్ హిట్ అందుకొని.. ఇప్పుడు ప్రాజెక్ట్ కె సినిమాతో ప్రపంచమంతా తనవైపు తిప్పుకొనేలా చేస్తున్న వైజయంతి మూవీస్ బ్యానర్ లో రోషన్ తన తదుపరి సినిమాను చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.
‘అద్వైతం’ లఘ చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న ప్రదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక నేడు రోషన్ పుట్టినరోజు కావడంతో అతడి పోస్టర్ ను రిలీజ్ చేసి అతడికి బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్. పోస్టర్ ను బట్టి ఈ సినిమా కూడా ఒక అందమైన ప్రేమకథగా అర్ధమవుతోంది. యాక్షన్ పీరియాడిక్ జోనర్లో ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు దర్శకుడు. రోషన్ ఒక బ్యాగ్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా కనుక హిట్ అయితే రోషన్.. స్టార్ హీరోల లిస్ట్ లోకి ఈజీగా వెళ్లిపోవచ్చు. మరి ఈ ఛాన్స్ ను మనోడు ఎలా యూజ్ చేసుకుంటాడో చూడాలి.