Pawan Kalyan: లక్కీ ఛాన్స్ పట్టేసిన శ్రీలీల.. ఏకంగా పవన్ సరసనే..?
Sreeleela In Pawan Kalyan’s Ustad Bhagat Singh:పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీలీల. మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీని మొత్తం తనవైపు తిప్పేసుకున్న ఈ భామ సీనియర్, జూనియర్ హీరోలు అని లేకుండా వరస పెట్టి సినిమాలు ఒప్పుకొని హిట్స్ అందుకుంటుంది. ఈ మధ్యనే ధమాకా తో హిట్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బాలకృష్ణ, మహేష్ బాబు సినిమాల్లో నటిస్తోంది. ఇక వీటితోనే అమ్మడి పేరు ఇండస్ట్రీలో మారు మ్రోగుతుంటే.. ఇంకో లక్కీ ఛాన్స్ పట్టేసి మిగతా హీరోయిన్లకు కునుకు లేకుండా చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- హరిష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. కోలీవుడ్ హిట్ సినిమా తేరి కేకు అధికారిక రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా..? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇక తాజాగా ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల నటిస్తుందని వార్తలు గుప్పుమనడంతో సినిమాపై అంచనాలు మరింత పెట్టేసుకున్నారు అభిమానులు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండగా.. ఒక హీరోయిన్ గా శ్రీలీల ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీకి వచ్చిన మొదటి సినిమానే రాఘవేంద్ర రావు చేతుల మీదుగా లాంచ్ అయ్యి షాక్ ఇచ్చింది. వెంటనే రవితేజ సరసన నటించి హిట్ అందుకుంది.. ఆ తరువాత మహేష్ బాబు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్.. ఆమె లైనప్ చూస్తే.. దేవుడా ఇప్పట్లో ఈ అమ్మాయిని ఆపడం ఎవరి వలన కాదు అని అనిపిస్తోందో. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.