ఒక భాషలో హిట్ అయిన సినిమా మరొక భాషలో రీమేక్ అవ్వడ చూస్తూనే ఉంటాం. అక్కడ కూడా హిట్ అయితే ఇంకో భాషలో రీమేక్ చేస్తారు. అలా మూడు భాషల్లో రీమేక్ అయ్యి హిట్ అందుకున్న సినిమా దృశ్యం.
ఒక భాషలో హిట్ అయిన సినిమా మరొక భాషలో రీమేక్ అవ్వడ చూస్తూనే ఉంటాం. అక్కడ కూడా హిట్ అయితే ఇంకో భాషలో రీమేక్ చేస్తారు. అలా మూడు భాషల్లో రీమేక్ అయ్యి హిట్ అందుకున్న సినిమా దృశ్యం. మలయాళంలో మోహన్ లాల్ నటించిన చిత్రం దృశ్యం. భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశాడు. ఇక్కడ కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఎక్కడ నుంచి హిందీకి వెళ్ళింది.. అక్కడ అజయ్ దేవగణ్ ఈ సినిమాను రీమేక్ చేశాడు. అక్కడ కూడా మంచి విజయం అందుకుంది. ఇక మొదటి పార్ట్ కు కొనసాగింపుగా రెండో పార్ట్ వచ్చింది. అది కూడా సూపర్ హిట్. రెండోపార్ట్ కూడా మిగతా భాషల్లో రేంక్ అయ్యింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా మూడో పార్ట్ కు సిద్దమవుతుంది.
ఇక ఈ నేపథ్యంలోనే ‘దృశ్యం’ చిత్రాన్ని కొరియన్ భాషలోనూ రీమేక్ చేయనున్నారు. దక్షిణ కొరియాకి చెందిన అంథాలజీ స్టూడియోస్ తో కలిసి పనోరమా స్టూడియోస్ నిర్మించడానికి రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో ఆస్కార్ అవార్డు అందుకున్న పారసైట్ సినిమాలో నటించిన సాంగ్ కాంగ్ హో హీరోగా నటిస్తున్నాడు. ఇక కొరియన్ భాషలో రీమేక్ అవుతున్న తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. ఇప్పటివరకు కొరియన్ సినిమాలను తెలుగులో రీమేక్ చేశారు కానీ, మొదటిసారి ఒక భారతీయ చిత్రం కొరియన్ లో రీమేక్ కావడం. దీంతో అభిమానులు ఇండియా రేంజ్ పెరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.