హీరోయిన్ ఇంట చోరీ.. కోటిన్నర సొత్తు చోరీ
కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తాను గర్భవతిని అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆమె ఇంట భారీ ఎత్తున చోరీ జరిగినట్లు తెలుస్తోంది. సోనమ్ కపూర్ భర్త ఆనంద్ ఆహూజాకు దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ బంగ్లా ఉంది. ఆ బంగ్లాలోనే చోరీ జరిగింది. ఆభరణాలు – డబ్బు… మొత్తం మీద సుమారు కోటిన్నర విలువ చేసే సొత్తు మాయం అయ్యింది. ఈ విషయమై న్యూఢిల్లీలోని తుగ్లగ్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో సోనమ్ కపూర్ అత్త, ఆనంద్ తల్లి ప్రియా ఆహూజా ఫిర్యాదు చేశారు. డ్రైవర్లు, కేర్ టేకర్లు, గార్డెనింగ్ పని చేసేవారు, వంట మనుషులు… మొత్తం ఆహూజా ఇంట్లో మొత్తం పాతిక మంది పని మనుషులు ఉన్నా దొంగతనం జరిగిన నేపథ్యంలో వాళ్ళను పోలీసులు విచారిస్తున్నారు. ఫిబ్రవరిలో చోరీ జరిగిందని, ఫిబ్రవరి 11న ఆహూజా ఫ్యామిలీకి దొంగతనం జరిగినట్టు అనుమానం వచ్చిందని సమాచారం. ఫిబ్రవరి 23న ఫిర్యాదు చేయగా ఇప్పుడు విషయం వెలుగులోకి వచ్చింది.