Sitara Gattamaneni:సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తండ్రి సపోర్ట్‌తో సోషల్ మీడియాలో సితార (sitara) చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. నచ్చిన వీడియోలు చేస్తూ ఇన్ స్టా వేదికగా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది.
Sitara Gattamaneni:సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తండ్రి సపోర్ట్‌తో సోషల్ మీడియాలో సితార (sitara) చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. నచ్చిన వీడియోలు చేస్తూ ఇన్ స్టా వేదికగా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా నిత్యం పోస్ట్‌లు పెడుతూ రీల్స్ చేస్తూ సందడి చేస్తున్న సితార ఇటీవల మహేష్ నటించిన `సర్కారు వారి పాట` మూవీలోని `ఎవ్రీ పెన్నీ..` సాంగ్ ప్రమోషనల్ వీడియోలోనూ కనిపించి ఔరా అనిపించింది.
నెట్టింట సితారకు 12 లక్షలకు పైనే ఫాలోవర్స్ ఉన్నారు. స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురుతో కలిసి సితార ఓ యూట్యూబ్ చానెల్ ను కూడా రన్ చేస్తోంది. ఇందులో ప్రముఖ సెలబ్రిటీలని ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన యునిక్ స్టైల్‌తో మహేష్ అభిమానుల్ని ఆకట్టుకుంటూ ఫ్యాన్ బేస్ ని ఇప్పటి నుంచే పెంచుకుంటూ పోతున్న సితార తాజాగా సరికొత్త రికార్డ్‌ని సాధించింది.
తనకున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఓ ప్రముఖ జువెల్లరీ సంస్థ తమ బ్రాండ్‌కు ప్రచార కర్తగా నియమించుకుంది. ఇందు కోసం తనకు భారీ స్థాయిలో పారితోషికాన్నిఅందించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే సితార ఈ కమర్షియల్ యాడ్ షూటింగ్ లో పాల్గొంది. మూడు రోజుల పాటు జరిగిన షూటింగ్‌ని భారీ స్థాయిలో చిత్రీకరించారట. ఈ యాడ్ షూటింగ్ కోసం ప్రముఖ టెక్నీషియన్లు పని చేసినట్టుగా తెలుస్తోంది. దేశంలోనే ఈ ఘనతని సాధించిన తొలి స్టార్ కిడ్‌గా సితార తొలి కమర్షియల్ యాడ్ డీల్‌తో రికార్డుని సాధించింది. ఈ యాడ్ టీవీల్లో త్వరలోనే ప్రసారం కానుంది.
🌟 Sitara Ghattamaneni, The Most Happening star kid to bag a major jewellery brand contract! 💎✨ Proud parents Mahesh Babu and Namrata are overjoyed!
Stay tuned for the grand TVC launch! @urstrulyMahesh #NamrataShirodkar #Sitara pic.twitter.com/rOMfEjcrio
— Mahesh Babu Space (@SSMBSpace) May 26, 2023