కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్(Cannes Film Festival)లో పాల్గొన్న శృతిహాసన్ (Sruthi haasan)మీడియాతో మాట్లాడుతూ రెమ్యునరేషన్లపై ఆసక్తికరంగా స్పందించింది.
Sruthi haasan:నటీనటుల పారితోషికాలపై ఇటీవల హీరోయిన్లు గళం వినిపిస్తున్నారు. ఏ విషయంలోనూ తాము తక్కువ కాదని, తమకు మాత్రమే తక్కువ రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తున్నారని, హీరోలకు మాత్రం భారీ స్థాయిలో పారితోషికాలు ఇస్తున్నారని, ఇందులో మాపై వ్యత్యాసం చూపుతున్నారని, టాలెంట్ ఆధారంగా రెమ్యునరేషన్లు డిసైడ్ చేయాలని ఇటీవల స్టార్ హీరోయిన్ సమంత సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తాజాగా మరో క్రేజీ లేడీ శృతిహాసన్ రెమ్యునరేషన్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్(Cannes Film Festival)లో పాల్గొన్న శృతిహాసన్ (Sruthi haasan)మీడియాతో మాట్లాడుతూ రెమ్యునరేషన్లపై ఆసక్తికరంగా స్పందించింది. భారతీయ చితన చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య పారితోషికాలకు సంబధించి చాలా వరకు వ్యత్యాసాలున్నాయని ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు బదులిచ్చింది. నిజాయితీగా చెప్పాలంటే ఈ తేడా అన్నిచోట్లా ఉంది. మనమంతా లింగ సమానత్వం కోసం ఎన్ంనో కలలు కన్నాం. మహిళల భద్రత, బాలికలకు విద్య, పరిశుభ్రత, మంచి ఆహారం..ఇలా ఎన్నో సమస్యలని పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని తెలిపింది.
ఇక వినోద రంగానికి సంబంధించిన మార్పులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. లేట్‌గా మొదలైనా ఖచ్చితంగా మార్పులొస్తాయి. నేను కూడా కొన్ని సందర్భాల్లో తకర్కువ పారితోషికం తీసుకున్న సందర్భాలున్నాయి. కానీ నేను ఎప్పుడూ ఈ విషయంలో బాధపడలేదు. ఎందుకంటే నాకు కావాల్సినంత పని ఉంది. అందులోనే నాకు ఆనందం ఉంటుంది. అయితే రెమ్యునరేషన్ విషయంలో హీరోయిన్లు అంతా కలిసి కట్టుగా ఉండాలి` అని తెలిపింది.
ఈ ఏడాది టాలీవుడ్ అగ్ర కథానాయకులైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలతో కలిసి ఒకేసారి నటించింది శృతి. చిరుతో `వాల్తేరు వీరయ్య`లో నటించగా, బాలకృష్ణతో `వీర సింహారెడ్డి`లో మెరిపింది. ఈ రెండు సినిమాలకు భారీ స్థాయిలోనే శృతిహాసన్ రెమ్యునరేషన్‌ని డిమాండ్ చేసిందట. ప్రస్తుతం ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న `సలార్`తో పాటు నాని హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలోనూ కనిపించనుంది. అంతే కాకుండా `ది ఐ` పేరుతో రూపొందుతున్న ఇంగ్లీష్ మూవీలోనూ నటిస్తోంది. వీటితో పాటు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న `బ్రో` మూవీలోని ప్రత్యేక గీతంలో శృతి నటించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.