Shruti Haasan: ఆటలో అరటిపండు అయినా సంక్రాంతి అమ్మడిదే..
Shruti Haasan Is The Luckiest Heroine In This Sankranthi: సంక్రాంతి హీరో ఎవరు అని పక్కన పెడితే.. హీరోయిన్ మాత్రం శృతి హాసనే.. ఈ సంక్రాంతి లక్కీయేస్ట్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది శృతి హాసన్ మాత్రమే. ఇద్దరు స్టార్ హీరోలు.. ఒకే నిర్మాణ సంస్థ.. ఒక్క రోజు గ్యాప్ లో రెండు సినిమాలు.. రెండు సినిమాలు హిట్స్. వాల్తేరు వీరయ్య లో చిరు సరసన, వీరసింహారెడ్డి లో బాలయ్య సరసన ఆడిపాడింది. అయితే అంత గొప్పగా చెప్పుకొనే పాత్రలు కాకపోయినా హీరోయిన్ గా ఉన్నందుకు హిట్లు అందాయి. నిజం చెప్పాలంటే రెండు సినిమాల్లోనూ అమ్మడు ఆటలో అరటి పండే. కానీ, శృతికి బాగానే పేరు వచ్చింది.
కెరీర్ లో ఏ హీరోయిన్ కు దక్కని అరుదైన సక్సెస్ లు ఒకేసారి దక్కించుకున్న హీరోయిన్ గా శృతిహాసన్ రికార్డుని సొంతం చేసుకుంది. దీంతో శృతి లక్కీ హీరోయిన్ అని పేరు తెచ్చేసుకుంది. ఇక నుంచి అమ్మడు మరింత బిజీగా మారనుంది. ప్రస్తుతం శృతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ ‘సలార్’లో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో శృతి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.